గ్రామపంచాయతీ నుండి దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలి

ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ బషీర్!!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో వివిధ పనుల నిమిత్తం ,పంచాయతీ నిధులనుండి ప్రభుత్వ నిధులు సుమారుగా కోటి 50 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని, తిరిగి దుర్వినియోగం చేసిన నిధులను రాబట్టి గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని అలాగే అక్రమంగా నిధుల వినియోగానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్ ని అలాగే ఇట్టి దుర్వినియోగం చేసిన నిధుల వెనుక ఎంతటి వారైనా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని ఇట్టి నిధులను రికవరీ చేసి మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరడం జరుగుతుంది అదేవిధంగా ఇట్టి విషయంపై ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మరియు శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇట్టి నిధులను దుర్వినియోగం చేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ,రికవరీ చేసిన నిధులను,మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అందుర్తి గంగాధర్, దేవీ రవీందర్, తోడేటి బాల్ లింగు, సత్యనారాయణ, బూరగడ్డ శ్రీనివాస్, రవీందర్, కుసుమ రాజు, నస్పూరీ మల్లేశం, మంథని రాజయ్య, రమణారెడ్డి, ప్రశాంత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించిన ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ బషీర్!!!
ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క ఆదేశాలతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని పారిశుద్ధ్యంలో ముందుంచిన పారిశుద్ధ కార్మికులకు గ్రామ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ బషీర్ చే ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి , అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మరియు గ్రామ పౌరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *