
"Telangana Journalists Demand Housing and Legal Protection"
విలేకరుల కష్టాన్ని గుర్తించండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో వేలాది విలేకరులు జీతాన్ని ఆశించకుండా జీవితాలను పడంగా పెట్టి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా రాతతో సమాధానం చెబుతూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ మంచి చెడ్డ ప్రజల వరకు చేరవేస్తూ ఎల్లప్పుడు ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టులకు గుర్తించండి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం విలేకరులకు ఇంటి నిర్మాణ స్థలాలను కేటాయించాలి మరియు జర్నలిస్టుల పిల్లలకు విద్య వైద్యరంగంలో 50% రాయితీ కల్పించాలి అలాగే అక్కడక్కడ విలేకరులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి చట్టపరమైన రక్షణ కల్పించాలి జహీరాబాద్ నియోజకవర్గం గత ప్రభుత్వం విలేకరులకు డబల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తామని చెప్పింది అలాగే ఈ ప్రభుత్వం కూడా డబల్ బెడ్ రూములు కేటాయించాలి జహీరాబాద్ లో 60 డబల్ బెడ్ రూమ్ లో ఉన్నాయని విలేకరుల కేటాయించాలని ఇళ్ల స్థలాలు తప్పకుండా కేటాయించాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను విజ్ఞప్తి చేశారు