నా కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి

ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక.( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:

నా కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి అని
ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని రెడ్డిపల్లి, కొండపాక ,శ్రీరాముల పేట, పోతిరెడ్డిపల్లి , హిమ్మత్ నగర్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకటి ఆలోచించండి అక్క చెల్లెలు .. మీకు ఏ ఇబ్బంది వచ్చిన, పెళ్లికి పిలిచిన చావు పిలిచిన నాకు సమాచారం వస్తే మీతో పాటు నేను ఉన్న అని మీ అందరి కూడా గుర్తుంచుకోవాలని మీరే నా కుటుంబ సభ్యులనీ అన్నారు. ఎవరు కాదన్నా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతున్నాడని చెప్పారు.
హుజురాబాద్ నియోజకవర్గం లో వేరే పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే మనకు ఏమన్నా ఒక్క ఇంచన్న లాభం ఉంటదా ఒకసారి మీరు ఆలోచన చేయండి అని ప్రజలను కోరారు.ఎమ్మెల్యే గా ఈటెల రాజేందర్ కు
20 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చినారు. ఏడు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు.ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇవ్వాలని మీ అందరిని కూడా కోరుతున్నానుఅని కౌశిక్ రెడ్డి అన్నారు.2018 లోని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా కొండపాక గ్రామం నాకు మెజారిటీ ఇచ్చింది. నేను మర్చిపోలేను కచ్చితంగా మీ అందరి కూడా మాటిస్తాను ఈసారి మీరు నాకు అద్భుతమైన మెజార్టీ ఇస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది నేను మీ అందరి కూడా మాటిస్తాను . కొండపాకతోపాటు అన్ని గ్రామాలలో గ్రామంలో మిగిలిపోయిన రోడ్లను, కుల సంఘాల భవనాలని, మహిళా భవనం, దేవాలయాలు ,చర్చిలు ఏమున్నా కూడా కచ్చితంగా పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటాని హామీ ఇస్తున్నాను . ఈ ఒక్కసారి మాత్రం నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మీ అందరిని కోరుతున్నాను. ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన అభివృద్ధి చేయాలే కానీ గ్రామాల్లో నేను చూసి గ్రామాలలో సిసి రోడ్లు వేసిన మీరు ఏది అడిగితే అది అద్భుతంగా మీకు చేసి పెట్టింది మీ అందరూ కూడా మర్చిపోదని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి,ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, మాడ వనమాల సాదవ రెడ్డి, గంగాడి తిరుపతి రెడ్డి,సంపత్ రెడ్డి, ఇంద్ర సేన రెడ్డి,
సర్పంచులు నర్సయ్య, అరుంధతి గిరిబాబు, అనూష సతీష్ గౌడ్, ఎంపిటిసిలు లక్ష్మి భూమయ్య, నల్ల మమత తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ రాజ్ కుమార్ భూమయ్య సుధాకర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ,గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, తిప్పని ప్రశాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గెల్లు రమేష్,భాస్కర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!