కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సర్వీస్ అవార్డు అందుకున్న రాసమళ్ళ కృష్ణ
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లాలోని కేఎంసి మరియు టిబి ఆఫీసర్ హిమబిందు ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసినందుకుగాను పరకాల మండలంలోని మళ్ళక్కపేట గ్రామానికి చెందిన రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణకి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అభినందిస్తూ ఉత్తమ సర్వీస్ అవార్డు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య,లలిత దేవి తదితరులు పాల్గొన్నారు.