అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టాలి

Real estate

అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టాలి

ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లాట్ చేసి అమ్మే భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

దుర్వినియోగం అవుతున్న అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాదీన పరుచుకోవాలి

ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకోవాలి

ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఆర్డీవో తహసిల్దార్లకు మెమోరాండం

నర్సంపేట,నేటిధాత్రి:

Real estate
Real estate

ప్రభుత్వ అసైన్డ్ భూములను దొడ్డి దారిన ఆక్రమించి ప్రభుత్వ నిబంధనలను అధిక్రమించి పేద మధ్యతరగతి ప్రజలను నమ్మించి అమ్మకాలకు కొనుగోళ్లకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ అసైన్డ్ భూములను రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యులు కన్నం వెంకన్న గుండెబోయిన చంద్రయ్య వంగల రాగసుధ డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలు ఆ భూముల రక్షణకై పోరు బాట పట్టక తప్పదని హెచ్చరించారు.నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గల సర్వేనెంబర్ 111 లోని అసైన్డ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా భూమి చదును చేస్తూ క్రయవిక్రయాలకు ప్రయత్నిస్తున్న స్థలాన్ని రక్షించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ, తహసిల్దార్ల వద్ద ఆందోళన చేసి మెమోరాండం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం పేదలకు మరియు సేవకులకు జీవనభృతి కోసం ప్రభుత్వ భూములను అసైన్ చేసి ఇస్తే అట్టి భూములను కొంతమంది అనర్హులు దుర్వినియోగం చేస్తూ దళారులకు క్రయవిక్రయాలకు పాల్పడుతూ ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని 1977 అసైన్డ్ యాక్ట్ ను విస్మరిస్తున్నారని ఈ క్రమంలో విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయం చేయడం కోసం ఇచ్చిన భూమిని దశాబ్దాల తరబడి బీడు బడి ఉన్న రెవిన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం అట్టి భూములను స్వాధీన పరచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యం కనబడుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ,అసైన్డ్ భూములను రక్షించాల్సిన రెవిన్యూ యంత్రాంగమే కబ్జాదారులకు వంత పాడుతున్నట్టు కనబడుతున్నదని ఆరోపించారు.పేదలు నిలువ నీడ కోసం గుడిసెలు వేసుకుంటే నిర్ధాక్షిణ్యంగా తొలగించి కేసులు పెట్టే ప్రభుత్వ యంత్రాంగం అంగ,అర్థ, రాజకీయ అధికార బలం ఉన్నవారికి మాత్రం అండగా నిలవడం జరుగుతుందని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంతకంటే అప్రజస్వామికం మరొకటి లేదని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని కోరితే నాన్చివేత ధోరణి ప్రదర్శించడం అధికారులకు తగదని ఇప్పటికైనా మాదన్నపేట రోడ్డు 111 సర్వే నెంబర్లో చట్టాలను ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా భూములను చదును చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్న కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎర్రజెండా ఆధ్వర్యంలో అట్టి భూమిరక్షణకు పూనుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎం సిపీఐ(యు) నాయకులు భైరబోయిన నర్సయ్య, ఎండి పాషా, అస్గర్, చొప్పరి పద్మ, చింతకింది మనమ్మ, గోనెల అనిత, పెండ్యాల సరిత, మురహరి సరోజన, పద్మ, సాంబ, అరుణ, సంపూర్ణ, నాగమణి, శివ నాగరాజు, ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!