అయ్యప్పస్వామిని దర్శించుకున్న ఆర్డీఓ ఉమారాణి
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా
నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో స్థానిక ఆర్డీఓ ఉమారాణి బుదవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవాలయ సిల్వర్ జూబ్లీ 25వ మండల పూజల మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్త దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు జరిగాయి.ఈ సందర్భంగా ఆర్డీఓ ఉషారాణి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.ఆలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాదవశంకర్,అధ్యక్షుడు సైపా సురేష్ ఆలయ కమిటీ దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా ఆర్డీఓతో ప్రత్యేక పూజలు చేసి శాలువాతో సన్మానించారు.
