పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో రెవెన్యూ డివిజన్ అధికారి డాక్టర్ కన్నం నారాయణ ప్రభుత్వ జూనియర్ కళాశాల,పాఠశాలలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడిన 40,43,49,51,56 59,60 పోలింగ్ స్టేషన్ లను సందర్శించారు.అనంతరం 6,7,8 దరఖాస్తుల వివరములను బీఎల్వో లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆదివారం రోజున కూడా సవరణలకు అవకాశం ఉన్నదని స్థానిక బూత్ లలో నమోదు చేసుకోవాలని స్పెషల్ క్యాంపేన్ డే లను ఉపయోగించుకోవాలని స్థానికంగా అందుబాటులో లేని వారు ఆన్లైన్ ద్వారా నమోదు,సవరణ లు చేసుకోవాలని కోరారు.
పోలింగ్ స్టేషన్ లను సందర్శించిన ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ
