రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లిలో, నేటి ధాత్రి:-

రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వార్షికోత్సవ వేడుకలు శ్వేతా గార్డెన్ లో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుల్మోహన్ పార్క్, ఓల్డ్ ఎంఐజి రెండు బ్రాంచీల విద్యార్థి విద్యార్థినీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావుస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు తమ ఆటపాటలతో ఎంతగానో అలరించారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులను రావుస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ప్రభాకర్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.. విద్యతో పాటు, నైతిక విలువలు, వినయ విధేయతలు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యా విధానాలు విద్యార్థుల మనస్తత్వాలను జాగృతి పరిచే దిశగా భోదనాలు నిర్వహించామని తెలిపారు. విద్యార్ధులు భారంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం చేరుకోవచ్చని,ఈ క్రమంలో చదువు, ఆటలు, సాంస్కృతిక కళలో విద్యార్థులు సాధించిన విజయాలపై వార్షిక నివేదికను ప్రవేశపెట్టిన పాఠశాల యాజమాన్యం,ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version