
New Ration Cards Distributed to Beneficiaries in Jhareerabad
ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు
◆:- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాక్సుధ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.