Life Imprisonment for Rape Convict
అత్యాచార నిందితుడికి జీవిత ఖైదీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేరస్థుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిన స్పెషల్ పోక్సో కోర్ట్ జడ్జ్ కె. జయంతి
నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నం.75/2018, లో మైనర్ బాలికను అపహరించి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడు తలారి లక్ష్మీనారాయణ @ చిన్ని, వయస్సు: 20 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్, నివాసం గురజాడ గ్రామం, కోహీర్ మండలం, ప్రస్తుతం పోతపల్లి గ్రామం, జహీరాబాద్ మండలం. కేసు పూర్వ పరాలు విన్న స్పెషల్ పోక్సో కోర్ట్ జడ్జ్ కె. జయంతి. నిందితుడు చేసిన నేర నిరూపితమైనందున IPC సెక్షన్ 376(2)(n), 366(A), 506, POCSO చట్టంలోని సెక్షన్ 5(l) r/w 6 మరియు SC/ST (POA) చట్టంలోని సెక్షన్ 3(2)(v) ప్రకారం దోషిగా తేలినందునా నిందితునికి జీవిత ఖైదు మరియు రూ.10,000/- జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో 1 సంవత్సరం కాలం సాదారణ శిక్ష విధించడం జరుగుతుంది.
కేసు విచారణలో భాగంగా కృషి చేసిన అధికారులు: SPL పబ్లిక్ ప్రాసిక్యూటర్: శ్రీ బి.సూరి రెడ్డి గారు, FIR I/O: శ్రీ ఎం.సురేష్, ఎ.ఎస్.ఐ, జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, I/O: ఎన్.రవి, ఎస్.డి.పి.ఓ, జహీరాబాద్ (ప్రస్తుతం అదనపు ఎస్పీ, వరంగల్), I/O-II: శ్రీ గణపత్ జాధవ్, ఎస్.డి.పి.ఓ జహీరాబాద్, ప్రస్తుతం ఎస్.హెచ్.ఓ: ఎం.కాశీనాథ్, ఎస్.ఐ, జహీరాబాద్ రూరల్, భరోసా లీగల్ టీమ్, సీడీవో: కె.కృష్ణ గౌడ్, పీసీ 2505, పోక్సో కోర్టు లైజనింగ్ ఆఫీసర్: బి.శంకర్, హెచ్.సీ 1575, జిల్లా లైజనింగ్ ఆఫీసర్: కె.సత్యనారాయణ, ఎస్.ఐ అధికారులందరికీ జిల్లా పోలీస్ అధికారి శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందనలు తెలిపారు.
