నందిమల్ల అశోక్ గురుస్వామి
వనపర్తి నెటిధాత్రి
ప్రతి సంవత్సరం మహా మండల పూజ 26న ఘనంగా ధర్మశాస్తా అయ్యప్ప స్వామీ దేవాలయంలో జరుగుతుంది.ఇట్టి మహా మండల పూజకు మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి ప్రతి సంవత్సరంలాగే 1లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందించార ని .రేపు జరిగే మండల పూజ కార్యక్రమములో స్వయంగా రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొని పూజలు నిర్వహిస్తారని గురుస్వామి నంది మల్ల అశోక్ తెలిపారు
మహా మండల పూజలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొంటారని గురుస్వామి నందిమల్ల.అశోక్ తెలిపారు.ఘనంగా స్వామి ఆభరణాల ఊరేగింప
అయ్యప్ప స్వామి మహా మండల పూజ సందర్భంగా ఆలయ కమిటి గురుస్వాముల ఆధ్వర్యములో స్వామీ వారి ఆభరణాల ఊరేగింపు రామాలయం నుండి రాజీవ్ చౌరస్తా ,ఇందిరా పార్క్ మీదుగా ఆలయానికి స్వాముల శరణ గోషలతో,భక్తుల నృత్యాల బాజాభజంత్రలతో స్వామి సన్నిధికి చేరుకున్నాయి.
ఇట్టి ఊరేగింపులో ఆలయ కమిటీ అధ్యక్షులు నగేష్,గట్టు.వెంకన్న,
గురుస్వాములు ముత్తుకృష్ణ, ప్రకాష్,నరేందర్, చీర్ల.కృష్ణ సాగర్, బీచుపల్లి యాదవ్, నందిమల్ల.అశోక్,కె.వి.ఆర్, సొప్పరాల.రాము, వెంకటేష్,ఆలయ ప్రధాన అర్చకులు అచ్చితాపురం రమేష్ శర్మ తో ఉంగ్లమ్.తిరుమల్ నాయుడు ప్రేమ్ నాథ్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారని అశోక్ ఒక ప్రకటన లో విలేకరుల కు తెలిపారు