ఓదేలు మృతదేహానికి నివాళులర్పించిన రంజిత్ రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు గాండ్ల ఓదెలు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఓదేలు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల ప్రసాద్, గుండ్రపల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ మండల నాయకులు రావుల మైపాల్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, కనపర్తి రమేష్, ఇటికల సంజీవయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.