Ranjith Kumar Appointed BC Power Advisor
బీసీ పవర్ జిల్లా గౌరవ సలహాదారుడిగా రంజిత్ కుమార్
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట పట్టణానికి చెందిన సామాజిక సేవాభావం కలిగిన నాయకుడు శ్రీ రాసమల్ల రంజిత్ కుమార్ (ఆర్కే)ను బీసీ పవర్ సంస్థ జిల్లా గౌరవ సలహాదారుడిగా నియమించారు.ఈ సందర్భంగా బీసీ పవర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మచ్చిక రాజు గౌడ్ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల స్థితిగతులను అధ్యయనం చేస్తూ, అన్ని కులాల భాగస్వామ్యంతో బీసీల హక్కుల సాధన కోసం సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రధాన సమస్యల పరిష్కారం, వారి జీవనోపాధి మెరుగుదల దిశగా బీసీ పవర్ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.అలాగే అన్ని కులాల ప్రజలు తమ విలువైన సమయాన్ని కేటాయించి బీసీ పవర్ సంస్థకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో బీసీ పవర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆబోతు రాజు యాదవ్ సూచన మేరకు రాసమల్ల రంజిత్ కుమార్ ను జిల్లా ముఖ్య సలహాదారుడిగా నియమించినట్లు తెలిపారు.
