ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ
డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు
వీణవంక, ( కరీంనగర్ జిల్లా ):
నేటి ధాత్రి :
వీణవంక మండల కేంద్రంలో సోమవారం రోజున వీణవంక, చల్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక రికార్డులను పరిశీలించడం జరిగింది. ఇన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఫార్మసీ స్టోర్ లోని వేసవి కాలానికి సంబంధించి మందుల నిల్వలను కుక్క కాటు మందులను పరిశీలించారు. లేబరేటరీ మరియు ఎన్సీడీ క్లినిక్ లను సందర్శించి రక్తపోటు, డయాబెటిస్ రోగులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ప్రతి నెల వారికి మందుల పంపిణీ రికార్డు పరిశీలించి అక్కడికి వచ్చిన రోగులను వారికి అందుతున్న ఆరోగ్య సేవల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని లేబర్ రూమ్ లను సందర్శించి జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి కానుపు లన్నీ గవర్నమెంట్ నార్మల్ డెలివరీల కొరకు ప్రోత్సహించి సిజేరియన్ డెలివరీల పర్సంటేజీ తగ్గించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని నార్మల్ డెలివరీలను పెంచాలన్నారు. అదేవిధంగా అవుట్ రీచ్ కేంద్రాలలో ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులు నిర్వహించి మహిళలందరికీ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ స్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వరుణ సుచిత్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.