రాములు మృతి పార్టీకి తీరని లోటు.
#అంతిమయాత్రలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి..
నల్లబెల్లి, నేటిధాత్రి:
మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏరుకొండ వెంకటేష్, వేణు తండ్రిగారైన రాములు గుండెపోటుతో సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి మృతుని సగృహానికి చేరుకొని మృతవి పార్థివ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్, నాయకులు మామిళ్ల రాజు, కస్తూరి రవి, పప్పు శంకర్, మేకల సాంబయ్య, ఆకుల సాంబారావ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, నరేష్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.