అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన రాంనగర్ సర్పంచ్ – గ్రామాభివృద్ధిపై సానుకూల చర్చ
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు మండల పరిధిలోని రాంనగర్ గ్రామ సర్పంచ్ ఆకులపెల్లి స్వాతి శనివారం అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయినవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్, తహసీల్దార్ విక్రమ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజ్ కుమార్లతో గ్రామంలో శాంతి భద్రతలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సానుకూలంగా చర్చించారు. గ్రామాభివృద్ధికి అధికారులు పూర్తి సహకారం అందించాలని సర్పంచ్ కోరగా, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బొమ్మినేని రాకేష్ రెడ్డి పాల్గొని, గ్రామ సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ భేటీ రాంనగర్ గ్రామాభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో నరసింహులగూడెం గ్రామ సర్పంచ్ పోలేపల్లి శివ శంకర్ రెడ్డి ముఖ్య నాయకులు ఉల్లెంగుల సమ్మయ్య వడ్లకొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
