తెలివితక్కువవాళ్లు తప్పుడు మార్గంలో ప్రయాణించడం సహజం. కానీ తెలివిగలవాళ్లు పతన మార్గంలో పయనిస్తే పర్వర్షన్‌కు గురై, సమాజ క్రమాన్నే ధ్వంసంచేసే ప్రవృత్తికి దిగజారతారు. ఇటువంటివారు సమాజంలో పేరున్నవారైతే వారి కలిగించే దుష్ప్రభావం ఎంత దారుణంగా వుం టుందో చెప్పలేం. రామ్ గోపాల్‌వర్మ తెలుగు సినిమాకే కొత్త పోకడలు తీసుకొచ్చిన గొప్ప సృజ నాత్మక దర్శకుడుగా అంగీకరించాల్సిందే! కానీ తర్వాతి కాలంలో ‘నా ఇష్టం వచ్చినట్టు బతుకు తా’ అనే పంథాని అనుసరించి, చెత్త సినిమాలు సమాజం మీదికి వదలడంతో, తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్న సామెతలా పరిస్థితి తయారైంది. అటువంటి రామ్ గోపాల్ వర్మలో ఇప్పుడు జ్ఞాన సూర్యడు ఉదయించాడు. 1998లో హిట్ అందుకున్న సత్య సినిమా రెండోసారి రిలీజ్ సందర్భంగా ట్విట్టర్‌లో ‘తాను ఇప్పటివరకు చేసిన ప్రయాణంపై తీవ్రంగా బాధపడ్డాడు’.ఇకనుంచి మంచి సినిమాలే తీస్తానని శపథం చేశాడు. ఇప్పటివరకు లక్ష్యంలేని ప్రయాణం చేశానని, రంగీలా, సత్య వంటి సినిమాల సక్సెస్‌తో కళ్లు నెత్తికెక్కి పతనమైపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొత్త ఒరవడి పేరుతో కళ్లకు గంతలు కట్టుకొ ని అసభ్య సినిమాలు తీసానంటూ తీవ్ర ఆవేదన పడ్డాడు. తనలోని తెలివితేటల విలువలు తెలుసుకోకుండా, లక్ష్యం లేని జీవితం గడిపానంటూ బాధపడ్డాడు. చేసిన తప్పుల్ని దిద్దుకోలేకపోయినా ఇక ముందు నెంబర్ వన్ సినిమాలే తీస్తానని చెప్పాడు! మంచి మార్పులకోసం కాలం ‘పశ్చాత్తాపమనే’ అద్భుత ఔషధాన్ని ఎప్పుడూ సిద్ధంగా వుంచుతుంది. రాము ఇప్పుడు ఆ ఔషధాన్ని స్వీకరించారు. ఆయనలోని గొప్ప టాలెంట్ బ యటకు రావాలని ఆశిద్దాం!