
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన సతెమ్మ చిత్ర పటానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సతెమ్మ కుమారులు రంగు రాజు గౌడ్, ప్రసాద్ గౌడ్, సంతోష్ గౌడ్ లను పరామర్శించారు. ఈ కార్యక్రమం లో ఇటుకాలపల్లి గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర ఆనందం గౌడ్,మాజీ అధ్యక్షులు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షులు కట్ల సుధాకర్ గౌడ్,కోశాధికారి తాళ్లపెల్లి అశోక్ గౌడ్, ఆరెల్లి హరికిషన్ గౌడ్, ధోనికెల మోహన్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఆరెల్లి ఎల్లా గౌడ్, బుర్ర శివకుమార్ గౌడ్, పూజరి బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.