
Ramayampet BC Bandh for 42% Reservation
బీసీల రిజర్వేషన్ కోసం రామాయంపేట బంద్ పిలుపు..
రామాయంపేట అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)
తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే 18వ తేదీ శనివారం రామాయంపేట బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
మెదక్ జిల్లా బీసీ సంక్షేమం, రాజకీయ, కుల, మహిళా, యువజన, ఉద్యోగుల, దివ్యాంగుల, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకత్వంలో రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీకర ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది.
సమావేశంలో నేతలు మాట్లాడుతూ — రాష్ట్ర జనాభాలో 65 శాతం బీసీలు ఉన్నా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత న్యాయం చేయాలంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ జేఏసీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణం మరియు మండలంలోని ప్రజలు, వ్యాపార వాణిజ్యవేత్తలు, కుల సంఘాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగులు, యువజన సంఘాలు, అలాగే ఎస్సీ–ఎస్టీ, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
నాయకులు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి బంద్‌ను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం. మామిడి సిద్ధరాములు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్. రేవెల్లి వినయ్ సాగర్. బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.