పాటే నా ప్రాణం పాట తోనే నా ప్రయాణం
కాలి కడుపుతో బయలెల్లె కళాకారునిగా బయటికచ్చే
అన్న వదినలే అమ్మానాన్న లైన తరుణం,
ఎన్నో సమస్యల మీద గలమెత్తిన ఘనత సుమన్ ది
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడా మండలానికి చెందిన రామంచ సుమన్ తండ్రి సారయ్య
తల్లి సారక్క,సుశీల ల కుమారుడు సుమన్ కు ఒక అన్నయ్య రాజేందర్,తమ్ముడు నరేష్ అక్షరాభ్యాసం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు యుపిఎస్ వరికోలు గ్రామంలో అక్షరాబ్యాసం చేసాడు.6వ తరగతి నుండి,8వ తరగతి వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామంలో 9వ తరగతి నుండి 10వ తరగతి వరకు శాయంపేట బాయ్స్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల మడికొండ లో డిగ్రీ ఏబీవీ గౌట్ డిగ్రీ కళాశాల జనగామలో పీజీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి హైదరాబాద్ లో తన అక్షరాబ్యసాన్ని పూర్తి చేసారు.సుమన్ ది ఒక నిరుపేద కూలి కుటుంబం నాన్న కూలి పని చేసేవాడు అమ్మ సంవత్సర వయసులోనే చనిపోయింది నాన్న మళ్ళీ పెళ్లిచేసుకోవలసి వచ్చింది అప్పటినుండి సుమన్ కు తాత,నానమ్మలు తల్లిదండ్రులుగా కొంత కాలం చూసుకోవడం జరిగింది.వాళ్లతో పాటు చిన్న నాన్నలు చిన్నమ్మలు,పెద్దమ్మలు పెద్దనాన్నల సహకారం కూడా తనకు అండగా నిలబడింది.తాత నానమ్మ చనిపోయిన
తర్వాత సుమన్ అన్నయ్య రాజేందర్ వదిన పూర్తి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేయడం తదుపరి పెళ్లి చేసారు.బాల్యమంతా హాస్టల్లోనే గడిచిపోయింది ఆరవ తరగతి నుండి మొదలుకొని పీజీ వరకు కూడా హాస్టల్లోనే చదువుకొనసాగించాడు.ఒక్క మాటలో చెప్పాలంటే హాస్టల్ తనకు మరో అమ్మ అయింది.
పాట తనకి వారసత్వంగా తన తాత నుండి వచ్చిన కళగా చిన్నప్పటి నుండే పాటలు పాడుతూ అనేక వేదికల మీద అనేక బహుమతులు కూడా అందుకోవడం జరిగింది.తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జగట్టి గొంగడి భుజానవేసి అనేక వేదికల మీద తన గలాన్ని వినిపించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశాడు సుమన్.అన్న రామంచ రాజేందర్ కూడా రచయిత గాయకుడుగా పాట పాడడం తాత నుండి వారసత్వంగా వచ్చినప్పటికీ కూడా,పాటలు రాయడం అన్న నుండి నేర్చుకున్న కళగా
నిరుద్యోగ సమస్య మీద “ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే అనే పాట తనకేంతో గానో పేరు తీసుకొచ్చింది.దాంతోపాటు ఉపాధ్యాయుల మీద రాసిన తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా,భారతదేశ స్థితి గతుల మీద రాసిన
తరాలు మారుతున్నయే స్వతంత్ర దేశమా తలరాత ఎప్పుడు మారునే నా భారత దేశమా అంటూ సఫాయి కార్మికుల మీద రాసిన
కోడి కూయ ముందు లేసె సఫాయన్నలారా మీకు సలామన్నలారా కాలేజీ వీడ్కోలు సమావేశం మీద పాట రాసాడు ఏ చోట నుండి వస్తిమో మనము ఈ చోటే విడిపోతున్నాము అనే పాట, వేశ్య మీద,ఎదిరి చూసే బతుకాయే ఎవడొస్తాడోనని
అనే పాట,రైతు మీద నేలను నమ్మి సాగు చేసేటి రైతన్న అనే పాట,హాస్టల్ మీద నిన్ను విడిచి వెళ్ళుతున్న అమ్మ నాకు అన్నం పెట్టిన హాస్టల్ అనే పాట,అమ్మ మీద జగతిలోన గొప్పది రా అమ్మ అనే పాట ఇలా అనేక సామాజిక అంశాల మీద పాటలు రాస్తూ,వీటితోపాటు జానపద గేయాలు,ప్రేమ గీతాలు రాస్తూ పాడుతూ,చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలను దిగమింగుకొని పొట్ట చేతబట్టుకొని,పాటనే ఆయుధం గా మలుచుకొని
పాటనే జీవనోపాధిగా ఎంచుకొని జీవనము కొనసాగిస్తున్న రామంచ సుమన్.