
Ramalinga Reddy's soul is the chairman
సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్ కేటాయించడంపై హర్షం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారిని గుర్తించి పార్టీ అధిష్టానం అందలం ఎక్కిస్తుందని దానికి ఉదాహరణ కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రామలింగ రెడ్డి కి ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం అని, పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి అవకాశాలు ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేసిన పట్లోళ్ల రామలింగ రెడ్డి కి జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వడంపై కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ షౌకత్ అలీ హర్షం వ్యక్తం చేస్తు పార్టీ అధిష్టనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షౌకత్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐక్యంగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో, నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పార్టీ అమలు చెస్తూన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని తెలిపారు.