రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రం మీదుగా రామడుగు మండలం కొక్కరకుంట, వన్నారం, మోతే, గోలిరామయ్యపల్లె, కొరటపల్లి, షానగర్ గ్రామాల మీదుగా గతంలో నడిపిన బస్సులను పునరుద్ధరణ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు. బస్సులను పునరుద్ధరణ చేసినట్లైతే పైగ్రామాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఉదయం మోడల్ స్కూల్ కి వెళ్లేందుకు ఇబ్బంది కాకుండా ఉంటుందని వినతిపత్రంలో తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు ఉప్పల్ అంజని ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.