చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున రంజాన్ వేడుకలు స్థానిక మసీదులో ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు, ముస్లింలకు అతి పవిత్రమైన పండుగలలో ముఖ్యమైనది రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కూడా 30 రోజులకఠినమైనటువంటి ఉపవాస దీక్షను చేసి ఈద్గాలలో మసీదు ఆవరణలోని మైదానాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసుకొని బంధుమిత్రులకు ఇరుగుపొరుగు వారికి స్వీట్స్ సేమియాపాయసం పంచి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు, ముఖ్యంగా ఎవరైతే సమాజంలో బీదవారుగా ఉంటారో వారికి జకాత్ మరియు ఫిత్రా చెల్లించి వారు ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటారు ,ఇదేవిధంగా మండల కేంద్రంలోని మజీద్ ఎ కౌసర్ ఆవరణలోనీ ఈద్గాలో ఎంతో భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసుకొని పండుగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకున్నారు, ఈ సందర్భంగా మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ పాల్గొని మాట్లాడుతూ రంజాన్ పండుగ గంగ జమున తహసీబ్ కే జైసా హిందూ ముస్లింలు కలిసిమెలిసి అన్నదమ్ముల వలె కలిసి సమాజంలో ఉండే పండుగ శఅని తెలియ జెసి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సమావేశంలో మజీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ అజ్మత్ మియా హైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ సభ్యులు మహమ్మద్ యూసుఫ్ ఆటో అంకుస్ జలీల్ మునీర్ చికెన్ అంకుస్ పాల్గొన్నారు.