ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
పవిత్ర రంజాన్ పండుగని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని ఈద్గాలో పార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పవిత్ర రంజాన్ పండుగ ను పురస్కరించుకుని వారు మాట్లాడుతూ నెలరోజులు కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అన్నారు.రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ,ఆధ్యాత్మిక చింతన,దాతృత్వం,ప్రేమ,దయ,సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయి అన్నారు.ఈకార్యక్రమంలో టిజిఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ గారు,మైనార్టీ సోదరులు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర,జిల్లా,అసెంబ్లీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.