ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు
జహీరాబాద్. నేటి ధాత్రి:

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండగ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. జహీరాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో గల ముస్లింలు ఉపవాస దీక్షను పాటిస్తున్నారు.. ఉపవాస సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి వాహనాల తనిఖీ చేయరాదని, చాలన్లు విధించరాదని, నమాజ్ వేళ్లే సమయంలో వాహనాలు తనిఖీ చేయరాదని జహీరాబాద్ ఈద్గా కమిటీ సభ్యులు స్థానిక పట్టణ ఎస్సై కాశీనాథ్ ను కోరారు. దీంతో పాటుగా ఉపవాస దీక్షలు విరమించే సమయంలో విద్యుత్ అంతరాయము రాకుండా చూడాలని విద్యుత్ సరఫరా లో ఏదైనా అంతరాయం ఉంటే ముందే సూచించాలని విద్యుత్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ మాసం అతి పవిత్రంగా భావించి ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేస్తూ సాయంత్రానికి ఉపవాస దీక్ష విరమిస్తారు. ఈ మాసంలో ముస్లింలు పవిత్రంగా ఉంటూ అల్లాను ధ్యానిస్తూ ఐదు సార్లు నమాజు చేస్తూ ఉపవాసలు కొనసాగిస్తారు. అధికారులను కలిసి ఈద్గా కమిటీ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మాజీద్, మొహమ్మద్ ఇనాయత్ అలీ, మొహమ్మద్ అక్బరుద్దీన్, మొహమ్మద్ ఆయుబ్, తదితరులు ఉన్నారు.