— నిజాంపేట మండలంలో రంజాన్ వేడుకలు
• ఈద్ శుభాకాంక్షలతో అలింగనం
నిజాంపేట: నేటి ధాత్రి
మండల కేంద్రంలో రంజాన్ పండగను పురస్కరించుకొని ఈద్గాలో ముస్లిం మత పెద్ద జనాబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించి సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అలైయి, బలైయి చేపట్టడం జరిగిందన్నారు. మతసామరస్యానికి ప్రతీక గా రంజాన్ పండుగను కొలుస్తామన్నారు. సమానత్వం, పరమత సహనం, సహాయగుణం, దయాగుణం వంటి విషయాలపై వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.