కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి :
ముస్లింల పవిత్ర పండుగ అయినా రంజాన్ పండుగను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ మజీద్ ఆవరణలోని ఈద్గాలో మండలంలోని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసుకుని ఒకరికొకరు అలై బాలాఈ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సమావేశంలో మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ నెల ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష లో ఉండి సోమవారం.రోజున ఉపవాస దీక్షను విరమించి రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే సమాజంలో గంగ జమున తహసీబ్ కే జైస హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ సమావేశంలో మసీదు కమిటీ అధ్యక్షలు అజ్మత్ మియా కార్యదర్శిహైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ వివిధ గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.