అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అధ్యక్షతన , డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భార్య మహాసాధ్వి త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది .
అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ ఆ మహాతల్లి కన్న పేగు కరిగి పోతున్నా కళ్ళ ముందు తన బిడ్డలు ఒకొక్కరు మరణించిన కన్నీళ్లు దిగమీంగుకుందని ఆ మహా తల్లి తన భర్త యగు బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్యమా పోరాటానికి ఒక పూట పస్తులు ఉంటూ తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బానిస బ్రతుకుల విముక్తి కోసం జాతి చైతన్యం కోసం ఆ మహానీయుని ముందుకు నడిపించిన త్యాగ మూర్తి రమాబాయి అంబేద్కర్ ని అన్నారు. ఆ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చగల మని తెలిపారు. ఆ పుణ్య దంపతులు చూపిన దారిలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నడువాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్ మండల నాయకులు గుర్రపు రాజమౌళి గురుకుంట్ల కిరణ్ పాముకుంట్ల చందర్ నేరేళ్ళ సమ్మయ్య జాలిగపు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!