
Ram Charan Completes 18 Years in Cinema
రామ్‌చరణ్ 18 ఏళ్ల కెరీర్.. ‘పెద్ది’ టీమ్ స్పెషల్ పోస్టర్
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయమయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2007 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది.
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ (Ram Charan) ‘చిరుత’ (Chirutha) సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయమయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2007 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది. చరణ్ డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో మెప్పించారు. తదుపరి మగధీర, నాయక్, రంగస్థలం వంటి భారీ చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. చిరంజీవి తగ్గ కుమారుడనిపించుకున్నారు. మెగాపవర్‌స్టార్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) గ్లోబల్‌స్టార్ అనిపించుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘చిరుత’ ప్రేక్షకుల ముందుకొచ్చి నేటికి 10 వసంతాలు పూర్తి చేసుకుంది. (18 years of RamcharanCareer)ఈ సందర్భంగా ‘పెద్ది’ టీమ్ (Peddi) ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘మా ‘పెద్ది’ 18 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే బయట ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండటమే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నారు.. మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్బాలను ఇచ్చాడు. మున్ముందు ‘పెద్ది’ నుంచి చాలా పెద్ద సర్ప్రైజ్లు మొదలు కాబోతున్నాయి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథతో తెరకెక్కుతోంది. వృద్థి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌తోపాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. ‘ఒకే పని సెసేనాకి.. ఒకే నాగ బతికేనాకి… ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాల… పుడతామా యేటి మళ్లీ’ అంటూ కొద్ది రోజులు క్రితం విడుదల చేసిన గ్లింప్స్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది.