
Jayashankar Bhupalpally
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక…. రక్షాబంధన్..!
చిట్యాల, నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శనివారం రోజున అన్న చెల్లెల అనుబంధానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలు ప్రతి ఇంటిలో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకున్నారు అలాగే అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పర్వదినం. సోదరుడికి కట్టే రాఖీలు సోదరీమణులకు రక్షణ కవచంగా నిలుస్తాయని విశ్వాసం. మండల వ్యాప్తంగా ఆడపడుచులు శనివారం రోజున రాఖీ పర్వదినాన్ని సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని జరుపుకుంటున్నారు, రాఖీ పర్వదినాన్ని రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రోజే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు, చెబుతుంటారు. అర్చకుల పంచాంగం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాఖీ పండుగను జరుపుకోవాలని ఆ సమయంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టవచ్చని వేద పండితులు తెలిపారు. సోదరుడికి రక్షాబంధన్ కట్టిన తర్వాత హారతి ఇచ్చి దీవిస్తారు, హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ ఒకటి. ఈ పండుగ సోదర సోదరీమణులకు మధ్య ప్రేమగా గుర్తుగా పేరుగాంచింది, రాఖీ కట్టిన తర్వాత తన సోదరికి సోదరుడు తన జీవితాంతం అండగా ఉంటానని అలాగే సోదరీమణులు తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి స్వీటు తినిపించి హారతిస్తారు. తనకు రాఖీ కట్టిన సోదరికి ఏదైనా చిరుకానుక గా బహుమతి ఇచ్చి జీవితాంతం కాపాడుతానని హామీ ఇచ్చినట్లుగా భావిస్తారు, ఈ రాఖీ పండుగ వేడుకలు మండలంలోని ఆడపడుచులు ప్రభుత్వ కార్యాలయాలలో మరియు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు.