
బొమ్మకంటి చంద్రమౌళి
పరకాల నేటిధాత్రి మంగళవారంరోజున పరకాల పట్టణం ఆర్ ఆర్ గార్డెన్స్ జరిగిన దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భముగా నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి మాట్లాడుతూ దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాన్ని తీసుకువచ్చిన నేత రాజీవ్ గాంధీ అని,వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భముగా వెంకటకృష్ణ మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆధునిక భావాలు, నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజీవ్‌గాంధీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాని అని అన్నారు.భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ అగ్రగామిగా నిల్పారని అన్నారు.కంప్యూటర్ విద్యను అమలు చేసే దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు.గాంధీ కుటుంబం మొత్తం దేశానికి,దేశ ప్రజల సేవకై అంకితమైందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,చెరుపెల్లి మొగిలి, బొచ్చు జితేందర్,బొచ్చు కట్టయ్య,ఒంటీరు సుధాకర్, ఒంటేరు రవికుమార్,బొచ్చు బాబు,లక్కం శంకర్ వసంత అభిమానులు,కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన కౌన్సిలర్ సంపత్
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక ఒకటవ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలతో ఘన నివాళి అర్పించారు.