రాజీవ్ గాంధీ సేవలు దేశానికి మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి
రాము మొగుళ్లపల్లి నేటి దాత్రి
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు స్మరించుకుంటూ ఆధునిక భారతా నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు దేశానికి సాంకేతికత విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు దేశంలో బీదరికాన్ని పురార తోలి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని కొనియాడారు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే చెందుతుందని నేటి యువత రాజీవ్ గాంధీ మార్గంలో నడవాలని సూచించారు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మరియు గ్రామీణ అభివృద్ధి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మూల బీజాలు వేశారు దేశంలో నూతన విద్యా విధానాన్ని 1986 లో ప్రవేశపెట్టారు గ్రామీణ ప్రాంతాల ప్రతిభవంతులైన విద్యార్థుల కోసం జవహర్లాల్ నవోదయ విద్యాలయానికి ప్రారంభించారు భారతదేశంలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారు
