
Rajiv Gandhi's death anniversary
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ వర్దంతిని పురస్కరించుకుని, ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత, ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ, గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది. పలువురు నాయకులు రాజీవ్ జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.