సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

Rajiv Gandhi

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మరియు రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!