
"Chityal Congress Celebrates Rajiv Gandhi’s 81st Birth Anniversary"
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించుకోవడం మొదటగా కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలంకరణ చేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది, అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారని అలాగే భారత రాజ్యాంగం కల్పించినటువంటి 18 సంవత్సరాల యువతి యువకులకు మొదటగా ఓటు హక్కును కల్పించిన మహా వ్యక్తి రాజీవ్ గాంధీ గారని తెలియజేశారు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ అనేక సేవలందించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని తన యొక్క సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య చిట్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ చిట్యాల మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ వికలాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పిట్టల సాంబయ్య మండల కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ నాయకులు బుర్ర మల్లేష్ ఏరుగొండ గణపతి నర్ర శివరామకృష్ణ పుల్ల సమ్మయ్య సరికొమ్ముల సదయ్య శనిగరం మొగిలి అందుకుల రాజు తదితరులు పాల్గొన్నారు.