
"Rajiv Gandhi Birth Anniversary Celebrated in Torrur"
కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
*తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవ నిర్మాత అని,ఐటీ రంగ వృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. దేశానికి సుస్థిర పాలన అందించి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ గ్రామపంచాయతీ వ్యవస్థను బలపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకట చారి,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,నాయకులు జలకం శ్రీనివాస్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి,కల్లూరి కుశాల్, ముద్దసాని సురేష్, జంజీరాల మనోహర్, జలీల్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన,బిజ్జాల అనిల్, జలగం వెంకన్న,యశోద, మహంకాల దుర్గేష్, జాటోత్ రమేష్ నాయక్, నడిగడ్డ మధు, నడిగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.