యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ
⏩ పేద ప్రజల గుండె చప్పుడు రాజీవ్ గాంధీ
⏩18 ఏళ్ల కే ఓటు హక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ
⏩ రాజీవ్ గాంధీ చొరవ వల్లే దేశంలో సాంకేతిక పరిజ్ఞానం
⏩ప్రజాసేవ కోసం ప్రాణ సైతం లెక్కచేయని వీరుడు రాజీవ్ గాంధీ
దుపాకి సంతోష్ కుమార్
16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
కాశిబుగ్గ నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి గొర్రెకుంట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోజున పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 10.00 గంటలకు భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ వర్దంతి సందర్భంగా 16వ డివిజన్ ఆధ్వర్యంలో కీర్తినగర్ క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీ లో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.
1968లో,సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు,
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ,ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు.దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని అన్నారు. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు.స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు.రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు.రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారని కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీకి మద్ధతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత 1983లో అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగ రక్షకులచే హత్యకు గురయ్యారు.అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.తదుపరి జనరల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగారు.1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు.అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు(పిసిసి),పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు.మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముగించారు.పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 1991 మే 21న,రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు.
వారి మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.వారు చేసిన సేవలను ఎప్పటికి అను నిత్యం కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూనే ఉంటుంది. పేద ప్రజలకు గుండె చప్పుడు గాంధీ కుటుంబమని వారు వ్యాఖ్యానించారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేవలం గాంధీ కుటుంబం మాత్రమే అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, జానపాక అధ్యక్షులు మహమ్మద్ జానీ,గరీబ్ నగర్ అధ్యక్షులు దాసారపు సారయ్య, కీర్తినగర్ అధ్యక్షులు హుజూర్,పరకాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిట్టల అనిల్,ప్రధాన కార్యదర్శి వల్లెం సాయికుమార్,పెద్ద జానీ,చెక్క రమేష్, గోదాసి చిన్ని,మాసూద్ అలీ,ప్రతాప్, కొమ్ముల రాజు, బిర్రు ప్రసాద్, రుద్రారపు సదా,అంకేశ్వరపు రాజు, మధుసూధన చారీ, మహిళా నాయకులు మౌనిక,నీలిమ,నూరజహాన్, కర్ణాకర్, రాజశేఖర్,అశోక్, శివ పవన్,అజీమ్,శ్రీనివాస్, మరియు 16వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.