
రామడుగు, నేటిధాత్రి:
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం అధికారుల బదిలీ చేపట్టగా రామడుగు మండలంలో విధులు నిర్వహిస్తున్న భాస్కర్ రావు బదిలీపై వెళ్లగా జగిత్యాల రూరల్ ఎంపిడిఓగా బాధ్యతలు నిర్వహించిన రాజేశ్వరి బదిలీపై కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపిడిఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు ఆహ్వానం పలికారు.