
మళ్లీ నోరు పారేసుకున్న రాజేంద్ర ప్రసాద్..
నట కిరీటిగా పేరుగాంచిన రాజేంద్ర ప్రసాద్.. వయసు మీద పడ్డాక విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలు సినిమా ఈవెంట్స్‌లో మాటలు నోరు జారి అనవసరంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో నోరు పారేసుకున్న వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే లం*కొడుక అలీ అంటున్న వీడియోతో బూతులు తిట్టించుకున్న రాజేంద్ర ప్రసాద్.. ఇదే ఫంక్షన్లో హీరోయిన్ రవళిని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన మాటలపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. పెద్ద గుండ్రాయిలాగా ఉందంటూ రవళిని స్టేజ్‌పైనే అవమానించాడు. సరదాగా అన్నానంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇలాంటివి అసలు క్షమించొద్దంటున్నారు నెటిజన్లు. అసలు సిగ్గుందా ఆయనకు.. ఫంక్షన్స్‌కు ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.