వినయ భాస్కర్ ను, విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు
బిఆర్ఎస్వి కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్
59వ డివిజను బిఆర్ఎస్వి నూతన కమిటీ నియామకం
హన్మకొండ, నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, దాస్యం వినయ భాస్కర్ గారి ఆదేశాల మేరకు 59వ బి ఆర్ ఎస్ వి నూతన ప్రెసిడెంట్ గా అర్వింద్ మరియు ఇంచార్జ్ గా రాయుడు
కార్యవర్గ సభ్యులను డివిజన్ ఇంచార్జి సంపత్ రెడ్డి డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్
నీలం సుహాస్ సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా
బిఆర్ఎస్వి కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో కనిపించని నాయిని రాజేందర్ రెడ్డి, తన రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ను ఏజెంట్లు ను పెట్టి ఇండ్లను అమ్ముకున్న చరిత్ర నీది, కరోనా కష్ట సమయాల్లో నువ్వు ఎక్కడున్నావు..? నీ అవినీతి బాగోతం ప్రజలకు తెలుసని,
నీ అసత్య మాటలను ప్రజలందరూ నమ్మరని, వినయ భాస్కర్ పేదల నాయకుడు అని, కరోనా విలయతాండం చేస్తున్న సమయంలోనే బయటకు వచ్చి ప్రజల కష్టాల్లో ఉన్నారని,అన్ని వర్గాలకు దాదాపు 40 వేల మంది కార్మికులకు నిత్యవసర సరుకులు అందించి వారికి అండగా ఉన్నారని ,రాజేందర్ రెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, కర్ణాటకలో మీరిచ్చిన గ్యారెంటీల హామీలతో ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడిందని, దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని, మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి సంపత్ రెడ్డి, కాంటెస్ట్ కార్పొరేటర్ నీలం సుహాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుమన్, మతిన్ బిఆర్ఎస్వి నాయకులు కళ్యాణ్, హైమద్ ,విద్యార్థి,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.