
• కుదేలైవుతున్న స్థానిక వ్యాపారులు
• గుమస్తాగిరి దక్కని లోకల్ యూత్
రాజస్థాన్ దుకాణాలు వద్దు – మన దుకాణాలే ముద్దు
వేములవాడ పట్టణంలో
నార్త్ వాళ్ళ ఇక్కడికి వచ్చి పాతుకుపోకుండా చూడాల్సిన భాద్యత మన అందరిదీ. పచ్చని పట్టణం లోమార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారుల పొట్టకొడుతున్నారు. కళ్లు తెరవకపోతే పూర్తిగా నాశనమే
ప్రత్యేక కథనం నేటి ధాత్రి లో
వేములవాడ పట్టణం వేములవాడ రూరల్ ప్రాంతంలో ఎటుచూసినా రాజస్థాన్ వ్యాపారుల హవా కనిపిస్తుంది. స్వీట్ బండితో రంగ ప్రవేశం చేశారు. పట్టణ ప్రధాన వ్యాపార కూడళ్లతో పాటు వేములవాడ నియోజకవర్గంలో దాదాపుగా అన్నీ మండల కేంద్రాల్లోనూ రెడీమేడ్, ఎలక్ట్రానిక్ షాప్స్, ప్లంబింగ్ షాప్స్, టీ షాప్స్, బైక్ మరియు ఆటో స్పేర్ షాప్స్, పెయింట్ షాప్స్, ఫాన్సీ షాప్స్, వుడ్ వర్క్ షాప్స్, మొబైల్ షాప్స్, గిఫ్ట్ షాప్స్, బెకెరీ షాప్స్, చాట్ బండి, స్వీట్ షాప్స్ పేపర్ అండ్ గ్లాస్ షాప్స్, గ్లాస్ వర్క్ షాప్స్ ఇలా అన్ని దుకాణాలు పెట్టారు. ఈ వ్యాపారాల్లో రెండు చేతులా సంపాదించారు. మన వ్యాపారులు నిద్ర పోతుండగా, రాజస్థానీలు మాత్రం తమ వ్యాపార సామ్రాజ్యన్ని విస్తరించారు. దాదాపు అన్ని వ్యాపారాలలో వాళ్ళు పాతుకు పోయారు, వారి వల్ల మన వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటున్నారు
నాసిరకం వస్తువులు అతి తక్కువ ధరకు ఇస్తున్నారు మరియు కంపెనీ ఐటమ్స్ అని చెప్పి డూప్లికేట్ ఐటమ్స్ తక్కువ ధరకు ఇస్తున్నారు.
రాజస్థాన్ వాళ్ళు మేస్త్రి లకు కమిషన్ ఒక రూపాయి ఎక్కవ ఇస్తుండటంతో వాళ్ళు కూడా రాజస్థాన్ వాళ్ళ దగ్గరే కొనండి ఐటమ్స్ బాగుంటాయి అని చెబుతున్నారు, ఒక్క రూపాయి ఎక్కువ కమిషన్ కోసం ఐటమ్స్ ఎలా ఉన్నా కూడా అక్కడే కొనేటట్టు చేస్తున్నారు.
పట్టణంలో రాజస్థానిల హవా జోరు గా సాగుతుంది వారి వ్యాపారాలు చిన్న స్వీట్ బండ్ల తో మొదలు అయిన వ్యాపారాలు పట్టణ నలుమూలల వారి వ్యాపారాలు నాలుగు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి ఇది ఇలాగే కోన సాగితే పట్టణంలో చోట మోట వ్యాపారల వ్యవస్థలు గుల్ల అవడం ఖాయం అని నెటీజనులు పలువురు చర్చించుకుంటున్నారు?