Surprise Hostel Inspection by District Medical Officer
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఈరోజు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌ను .అకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులను మరియు హాస్టల్ సిబ్బందిని జిల్లా వైద్యాధికారి. ఆరోగ్యశాఖ అధికారి. పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా హాస్టల్లో నాణ్యమైన వస్తువులను వంటలకు వాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. నిల్వ ఉన్న వంటలకు సంబంధించి ఆహార పదార్థాలు వాడరాదని. సూచిస్తూ పరిసరాలు పరిశుభ్రతగా. ఉంచాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని నీరు నిలువ ఉండకుండా చూడాలని. ప్రత్యేకంగా విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను వంటలకు వాడాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రతలపై అవగాహన కల్పిస్తూ నాణ్యత మైన భోజనాలు పెట్టాలని. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కేటాయించి విద్యార్థుల చదువుపై దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా హాస్టల్ . యజమాన్యానికి సూచిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రత్యేకంగా తెలియజేశారు అలాగే విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి మీ బాగోబాగులు చూసుకుంటున్నారా అని జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థులందరూ ఎప్పటికప్పుడు తగిన శుభ్రతలుపాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. జిల్లా వైద్యాధికారి. మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంపత్. సిహెచ్ఓ.బాలచంద్రం. వైద్య సిబ్బంది హాస్టల్ సిబ్బంది విద్యార్థులు తదితరులు ఉన్నారు
