రైతులపై కాంగ్రెస్ కపట ప్రేమ బయటపడింది.
#రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల ఆరాటం.
నల్లబెల్లి, నేటి ధాత్రి: రైతులకు రైతుబంధు ఇవ్వకుండా నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల అధికారికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం అవివేక చర్యాని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలలో రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించనున్న రైతుబంధు పంపిణీనీ ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను రైతులు తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమ అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ రైతాంగం గర్వించే విధంగా 2018లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ప్రతి రైతుకు జూన్, నవంబర్ మాసంలో ఎకరాకు పదివేల చొప్పున పంపిణీ చేస్తూ దేశానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు అలాంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులురాజకీయ లబ్ధి కోసం ఎన్నికల కోడ్ సమయంలో ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వకూడదని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం తో తెలంగాణ రైతాంగం పై ఎలాంటి ప్రేమ ఉందో బట్టబయలైంది రైతుబంధు పథకం ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదని రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులకు 73 వేల కోట్ల రూపాయలు పలు దఫాలుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని రాష్ట్రంలో రైతు పండించిన ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని నియోజకవర్గంలో ఒక రైతు బిడ్డగా రైతుకు ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నియోజకవర్గ రైతాంగానికి 50 శాతం సబ్సిడీ తో వ్యవసాయ పరికరాలను అందించే విధంగా కృషి చేస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీలు అడ్డుకోవడం సరికాదని ప్రజా సంక్షేమ పథకాలపై రాజకీయంగా పబ్బం గడుపుకునే నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు చర్యలను మార్చుకోవాలని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, నాయకులు ఊడుగులప్రవీణ్ గౌడ్, కక్కెర్లశ్రీనివాస్ గౌడ్, గందె శ్రీనివాస్ గుప్తా, బానోతు హరినాథ్ సింగ్, కొత్తపెళ్లి కోటిలింగాచారి, మాలోత్ ప్రతాప్ సింగ్, ఇంగ్లీ శివాజీ, విడియాల ప్రభాకర్, యూత్ అధ్యక్షుడు కృష్ణ, ఆకుల సాంబరావు, రవి, రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.