
heavy rain
భారీ వర్షంతో అప్రమత్తంగా ఉండాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారి వర్షం కారణంగా రాయిపల్లి (డి) చౌరస్తా నుండి గ్రామానికి వేళ్లే రోడ్డులో వాగు (మొగులాగు) భారీ స్థాయిలో వరుద నీరు రావడంతో రాకపోకలు నిలచి పోయాయి. ఈ విషయం జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులకు వివరించడంతో తహసీల్దార్ దశరథ్ వచ్చి సమీక్షించి జేసిబి ద్వారా నీటికి అడ్డు వచ్చిన మట్టి, చేట్లు, పిచ్చి మొక్కలను క్లీన్ చేసి వరుద నీరు సాఫీగా ముందుకు సాగి పోయింది. భారీ వర్షాలు కురవడంతో ఈ రోడ్డు పై ప్రయాణం చేసే రాయిపల్లి (డి), బిడెకన్నె గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ విషయంపై తహసీల్దార్ దశరథ్ మాట్లాడుతూ బారీ వర్షం కురినప్పుడు రోడ్డు పై నుంచి భారీ వరుద ప్రభావం ఉన్నప్పుడు ప్రజలు ఎవ్వరు ప్రయాణం చేయరాదని, పంచాయతీ కార్యదర్శి, గ్రామ మంచ్కూరిలకు సూచించారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ సిబ్బంది, రాయిపల్లి (డి) తాజ మాజి సర్పంచ్ విజయ్ కుమార్, గ్రామ పెద్దలు గోవర్ధన్ రెడ్డి, గ్రామస్థులు ఉన్నారు.