ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం. .

స్కాముల పార్టీ కాంగ్రెస్ పార్టీ…

బిజెపికి ఏ టీమ్ బీ టీమ్ కాంగ్రెస్ పార్టీనే…

తెలంగాణలో మోకాళ్ల యాత్ర చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాదు…. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి …

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జన గర్జన పేరుతో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ పార్టీ పై అవాకులు చవాకులు పేలుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవరెడ్డి ఆయన పై నిప్పులు చెరిగారు.ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ముందుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో మొదలుకొని 2G స్పెక్ట్రమ్ లాంటి అనేక స్కాములకు కాంగ్రెస్ పార్టీ నిలయమని అది ముందు మీరు గుర్తుంచుకోవాలని సూచించారు. 2018 ఎలక్షన్లలో రైతులకు 2లక్షల రుణ మాపి అన్నారు, పెన్షన్లు పెంచి ఇస్తామని హామీలు ఇచ్చిన అవి ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో ప్రజల చెంతకు పాలనను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగముందే దర్కాస్తు ఖాని , ధర్నా కానీ చెయ్యక ముందే దివ్యంగులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించి అమలు చేసే ప్రభుత్వము బిఆర్ఎస్. అసలు మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోసపూరిత హామీలు ఇస్తున్న మీ మాటలు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తా అన్న తీరుగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగకున్నా 200 నుండి 4000 వరకు ఇస్తున్న కేసీఆర్ ఎక్కడ ఆచరణకు నోచుకోేని మీ హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఏ సభలో మీరు మాట్లాడిన బిజెపికి బి టీమ్ బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారని అసలు మీ చేతగానితనం వల్లనే బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని,మొన్న నేషనల్ హేరాల్డ్ కేసులో ఐ.టి, ఈడి,సీబీఐ విచారణ ఎందుకు ఆగింది? జైల్లో ఉండాల్సిన మీకు మీ తల్లిగారికి బిజెపి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో, నరేంద్రమోదీ దయా దక్షిణ్యాల మీద మీరు దేశంలో పర్యటిస్తున్న విషయం ప్రజలకు తెలవదా, అసలు బిజెపికి ఏ టీం, బీ టీం రెండు కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో మీరు ఉన్నారని, రాష్ట్రంలో మీరు మోకాళ్ల యాత్ర చేపట్టిన అమలు కానీ హామీలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలిచి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!