భట్టి పాదయాత్ర పై రాహుల్ ఆరా.. ప్రశంసలు

Rahul Gandhi enquiry about the Bhatti Vikramarka People’s March :

తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం..వారి సమస్యల పైన సానుకూలంగా స్పందించటం పార్టీకి కలిసొచ్చే అంశంగా నేతలు రాహుల్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పైన భట్టి ఎక్కువగా దృష్టి పెట్టారని..వాటి పైన స్పందిస్తున్న తీరుతో ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందాయి.

కర్ణాటక తరువాత దక్షిణాదిన తెలంగాణ కాంగ్రెస్ కు కీలకంగా మారింది. తెలంగాణలో భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ యాత్ర కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో పార్టీకి అధికారం.. ప్రధానిగా రాహుల్ లక్ష్యంగా భట్టి ప్రకటించారు. రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర కొనసాగిస్తున్నారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జూలై 2న ముగియనుంది. ఖమ్మంలో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కనున్నారు. భట్టి యాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ పెరిగింది. ఈ వేదిక అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. వీరందరినీ భట్టి పాదయాత్ర ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది.

ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల పైన భట్టి ప్రజల మధ్యనే ఉంటూ పోరాటం ప్రారంభించారు. పేద ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ..పేద వర్గాలతో మమేకం అయ్యారు. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని, ముఖాముఖి మాట్లాడుతూ, సభలు పెడుతూ.. ప్రజలతో నడుస్తూ భట్టివిక్రమార్క ప్రజలకు చేరువయ్యారు. పార్టీ నేతలతో భట్టికి ఉన్న సత్సంబంధాలతో అందరివాడుగా నిలిచారు. భట్టి యాత్రలో నేతలతా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పార్టీ జాతీయ నేతలు హాజరైన మద్దతిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలపైన ఎక్కడిక్కడ స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనం ప్రజలకు వివరిస్తూ భట్టి తన యాత్ర సాగిస్తున్నారు.

ఈ నెల 15న భట్టి జన్మదినం నాడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతున్న తీరును అభినందించారు. పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనూ భట్టి పాదయాత్ర గురించి ఆరా తీస్తున్నారు. భట్టి పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు పర్యటించటం.. భట్టికి స్థానికులు ఫిర్యాదు చేసిన అంశాల పరిష్కారినికి చొరవ తీసుకోవటం ద్వారా భట్టి యాత్ర ఆ పార్టీలో ఎంత కలవరపాటుకు గురి చేస్తుందనేది స్పష్టం అవుతోంది. పాదయాత్ర సమయంలోనే పార్టీలో నేతల చేరికల పైన భట్టి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పొంగులేటి వంటి నేతలు భట్టిని కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ హాజరు కానున్నారు. ధృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు స్పూర్తిగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!