
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నేటి ధాత్రి, హైదరాబాద్:
రాబోయే మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసి గద్దెనెక్కిన తరువాత ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.