
-భద్రాచలం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసు
భద్రాచలం నేటి ధాత్రి
రోడ్డు భద్రతవారోత్సవాల్లో భాగంగా భద్రాచలం ట్రాఫిక్ పోలీసులు రోజుకు ఒక ప్రాంతంలో వాహనదారులతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో భద్రాచలం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్రిడ్జి సెంటర్, అంబేద్కర్ సెంటర్ ,కూనవరం రోడ్డు ,చర్ల రోడ్డు ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనల పై వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు…
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలసి భద్రాచలం లారీ అసోసియేషన్ వారితో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు… అనంతరం ఎస్సై శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, లారీలకు కచ్చితంగా రేడియం స్టిక్కర్లను వేసి వాహనాలు నడపాలని దానితో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అవగాహన సదస్సులో లారీ ఓనర్ డ్రైవర్లకు రేడియం స్టిక్కర్లపై అవగాహన కల్పించారు… భారీ వాహనదారులు రేడియం స్టిక్కర్లు ఉపయోగించకపోతే వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు….
ఈ కార్యక్రమంలో భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై ఎం శ్రీనివాస్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.