ఎమ్మెల్యేకు రాచూరు కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్మానం.

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామానికి మట్టి రోడ్డు 7 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంది. దీంతో మండల కేంద్రం నుండి రాచూరు గ్రామానికి వెళ్లాలంటే వాహనదారులు, బాటసారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం మొదలైతే.. ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనాదారులు జంకుతున్నారు. బిజెపి పార్టీకి చెందిన పలువురు నాయకులు గత ఐదేళ్ల క్రితం బీటీ రోడ్డు నిర్మించాలని పాదయాత్ర నిర్వహించారు. పలుమార్లు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం ప్రజావాణిలో.. బీటీ రోడ్డు నిర్మించాలని డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి బీటీ రోడ్డు నిర్మించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బీటీ రోడ్డు మంజూరుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. రాచూర్ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5. కోట్ల 20 లక్షలు మంజూరు చేశానన్నారు. బీటీ రోడ్డు మంజూరు కావడంతో దీంతో రాచూరు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి శాలువా కప్పి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హరికిషన్ నాయక్, నాయకులు పడకంటి వెంకటేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!