Srinivas Reddy Awarded PhD in Chemistry
రసాయన శాస్త్రంలో ఆర్.శ్రీనివాసరెడ్డికి పీహెచ్ డీ
నేటి ధాత్రి, పఠాన్ చేరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఆర్. శ్రీనివాసరెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘రిలుజోల్, 2-(4-అమినోఫెనిల్) బెంజోథియాజోల్, సీరం అల్బుమిన్, డీఎన్ఏల పరస్పర చర్యపై’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధన జీవసంబంధమైన స్థూల అణువులతో బెంజోథియాజోల్ అనలాగ్ ల పరమాణు పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి విలువైన సహకారాన్ని అందిస్తోందాని
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బిజయ కేతన్ సాహూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ రెడ్డి అధ్యయనం రిలుజోల్, 2-(4-అమినోఫెనిల్) బెంజోథియాజోల్ ద్వారా డీఎన్ఏ, హ్యూమన్ సీరం అల్బుమిన్ (హెచ్ఎస్ఏ)లో ప్రేరేపించిన బైండింగ్ లక్షణాలు, థర్మోడైనమిక్ పారామితులు, నిర్మాణాత్మక మార్పులను అన్వేషించినట్టు తెలియజేశారు. మాలిక్యులర్ డాకింగ్ సిమ్యులేషన్ ల ద్వారా ప్రయోగాత్మక పరిశీలనలకు మరింత మద్దతు లభించింది. ఈ పరిశోధన ఫలితాలు హేతుబద్ధమైన ఔషధ రూపకల్పన, ఔషధ పంపిణీ వ్యవస్థలు, మెరుగైన జీవసంబంధ కార్యకలాపాలతో కొత్త హైబ్రిడ్ ఉత్పన్నాల అభివృద్ధిలో సంభావ్య అనువర్తనాలను కలిగి ఉన్నాయి.ఈ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు డాక్టర్ శ్రీనివాసరెడ్డిని అభినందించారు
